రిజిస్ట్రేషన్లలో పారదర్శకతను పెంచడం, వెంటనే మ్యూటేషన్ పూర్తిచేసేందుకు ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. క్రెడాయ్, ట్రెడా సభ్యులు, ఉన్నతాధికారులతో సీఎస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరును వివరించారు. రిజిస్ట్రేషన్లు కాగానే పేరు మార్పు కూడా పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరిగిందని వివరించారు.
'ధరణి'పై ప్రభుత్వానికి క్రెడాయ్, ట్రెడా సభ్యుల ప్రశంసలు - ధరణిపై క్రెడెయ్, ట్రెడా సభ్యుల ప్రశంసలు
ధరణితో రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పెరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. క్రెడాయ్, ట్రెడా సభ్యులు, ఉన్నతాధికారులతో సీఎస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని క్రెడాయ్, ట్రెడా సభ్యులు అభినందించారు.
!['ధరణి'పై ప్రభుత్వానికి క్రెడాయ్, ట్రెడా సభ్యుల ప్రశంసలు Credo and Treda members praised government for Dharani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9598125-402-9598125-1605805327609.jpg)
'ధరణి'పై ప్రభుత్వానికి క్రెడెయ్, ట్రెడా సభ్యుల ప్రశంసలు
ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేయడాన్ని క్రెడాయ్, ట్రెడా సభ్యులు అభినందించారు. ధరణి పోర్టల్ ద్వారా ప్లాట్లు, స్థలాలు, భవంతులు వంటి రిజిస్ట్రేషన్లు త్వరితగతిన అవుతాయని.. ఆ వెంటనే మ్యూటేషన్ పూర్తి కావడం చాలా సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.
ఇవీచూడండి:23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్