JNTU: జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులకు సబ్జెక్టు మినహాయింపు ఇక లేనట్టే..! ఫలితాల ప్రకటన తర్వాత క్రెడిట్స్ తక్కువ వచ్చాయంటూ అనుత్తీర్ణత సాధించామంటూ విద్యార్థులు వర్సిటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వర్సిటీ చరిత్రలో తొలిసారిగా అత్యంత తక్కువ సమయంలోనే ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేసి పరీక్షల విభాగం అధికారులు ఫలితాలు ప్రకటించారు.
ఈసారి గతం కంటే ఎక్కువగా 68శాతం ఉత్తీర్ణతశాతం నమోదైంది. ఈ క్రమంలో క్రెడిట్స్ విషయంలో తక్కువగా వచ్చాయని, గ్రేస్ మార్కులు కలపలేదని, సబ్జెక్టు మినహాయింపు ఇవ్వలేదంటూ విద్యార్థులు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఆయా వెసులుబాట్లు కల్పించినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. 2018లో బీటెక్‌లో చేరిన విద్యార్థులకు ఆర్18 నిబంధనలను జేఎన్‌టీయూ అమలు చేస్తోంది.