తెలంగాణ

telangana

ETV Bharat / city

'అందుకే హైదరాబాద్​లో ఇళ్ల ధరలు పెరుగుతాయ్'

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగే అవకాశముందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు రామకృష్ణారావు అభిప్రాయపడ్డారు. భూములు ధరలు, స్టీల్‌, సిమెంట్‌, కార్మికుల కూలీలు పెరిగినందున ధరలు పెరుగుతాయని తెలిపారు.

credai-property-show-hyderabad-president-ramakrishna-rao
'అందుకే హైదరాబాద్​లో ఇళ్ల ధరలు పెరుగుతాయ్'

By

Published : Mar 22, 2021, 10:03 AM IST

హైదరాబాద్​లో భూముల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని క్రెడాయ్‌ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు సూచించారు. అనుమతి లేకుండానే ముందస్తు అమ్మకాలు.. సగం ధరకే ఫ్లాట్‌ అంటూ మోసపూరిత ప్రకటనలతో విక్రయిస్తున్నారని అన్నారు. నగరంలో ఇళ్ల ధరలు పెరిగే అవకాశముందని తెలిపారు.

భూములు, స్టీల్, సిమెంట్, కార్మికుల కూలీలు పెరిగనందున ధరలు పెరుగుతాయని స్పష్టం చేశారు. అన్ని రకాలుగా పరిశీలించాకే ఇళ్లు, భూముల కొనుగోలు చేయాలని సూచిస్తున్న క్రెడాయ్ అధ్యక్షుడు రామకృష్ణారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి..

క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు రామకృష్ణారావు

ABOUT THE AUTHOR

...view details