క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రాజశేఖర్ రెడ్డిలు చెప్పారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్న తాము... ఎప్పటికప్పుడు గతంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 80కిపైగా నిర్మాణదారులు తమ నిర్మాణాలకు సంబంధించిన ఆస్తులను ప్రదర్శనకు ఉంచుతారని తెలిపారు.
ఈ నెల 31 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ షో - hyderabad
ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షో జరగనుంది. 80కి పైగా నిర్మాణదారులు ఆస్తులను ప్రదర్శనకు ఉంచుతారని క్రెడాయ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.
గత ఏడాది యాభైవేల మంది వరకు సందర్శించారని... ఈ ఏడాది మరో 15శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని అన్ని స్థిరాస్తులకు చెందిన ఆస్తులు ఒకే చోట ఉంటున్నందున గృహాలను కొనుగోలు చేయాలనుకున్న వారు ఈ ప్రదర్శనకు వచ్చి ఎంచుకోవచ్చన్నారు. అన్ని ప్రాంతాలకు చెందిన ఆస్తులు ఒకే చోట ఉంటున్నందున.. తమ బడ్జెటుకు అనుగుణంగా ఎక్కడ కొనుగోలు చేయాలన్నది నిర్ణయించుకునే వీలు ఉంటుందన్నారు. నిర్మాణదారులు కూడా ఈ ప్రదర్శన సందర్భంగా కొంత రాయితీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని... అదే విధంగా బ్యాంకర్లు కూడా వడ్డీలో కొంత రాయితీ కల్పించేందుకు వీలుందని కూడా నిర్వాహకులు వివరించారు.
ఇవీ చూడండి: ప్రారంభమైన జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన