తెలంగాణ

telangana

ETV Bharat / city

marriage with goat: 'మేక'ను పెళ్లి చేసుకున్న యువకుడు.. కారణం తెలిస్తే షాక్..! - marriage with goat in ap

marriage with goat: ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నా.. ఏదో ఒక చోట ఇంకా మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. జ్యోతిష్యం పేరుతో వింత పోకడలకు పోతున్నారు. జాతకం ప్రకారం ఓ యువకుడి జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉందని.. దోష నివారణ కోసం మేకతో పెళ్లి జరిపించారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడులో జరిగింది.

'మేక'కు మూడుముళ్లు వేసిన యువకుడు.. ఎక్కడంటే..?
'మేక'కు మూడుముళ్లు వేసిన యువకుడు.. ఎక్కడంటే..?

By

Published : Apr 3, 2022, 1:58 PM IST

'మేక'ను పెళ్లి చేసుకున్న యువకుడు.. కారణం తెలిస్తే షాక్

marriage with goat: ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ఓ యువకుడికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడాలనుకున్నారు. అతడి జాతకాన్ని పరిశీలించేందుకు జోతిష్యుడిని సంప్రదించారు. ఆ కుర్రాడి జాతకంలో రెండు పెళ్లిళ్లు జరుగుతాయని ఉందని ఆయన వారికి వివరించారు. ఆ దోషం పోవాలంటే మేకను మనువాడితే సరిపోతుందని సూచించాడు. దీంతో జాతకాలపై నమ్మకమున్న ఆ యువకుడు.. మేకతో వివాహానికి రెడీ అయిపోయాడు.

నూజివీడు పట్టణ పరిధిలోని నవగ్రహ ఆలయంలో ఈ కుర్రాడికి మేకతో పెళ్లి జరిగింది. ఉగాది రోజున అర్చకులు యువకుడితో శాస్త్రోక్తంగా మేక మెడలో మూడు ముళ్లు వేయించారు. మేకతో మొదటి వివాహం అయిపోయింది కాబట్టి.. ఇక పెళ్లి చేసుకున్నా ఇబ్బంది ఉండదని యువకుడు భావిస్తున్నాడు. స్థానికులు మాత్రం మేకతో పెళ్లేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇదీ చదవండి:పుడింగ్​ అండ్​ మింక్​ పబ్​లో పట్టుబడిన వారిలో సినీ ప్రముఖులు.. జాబితాలో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్

ABOUT THE AUTHOR

...view details