ప్రతి ఏటా ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇస్తున్న ఎకలెన్స్ అవార్డు 2020... చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మహిళా సంక్షేమ కేంద్రానికి దక్కింది. ఈ అరుదైన గౌరవం దక్కినందుకు గానూ... సంక్షేమ కేంద్ర కార్యనిర్వాహక సమితిని ఏఐటీయూసీ కార్యదర్శి డా. బీవీ విజయలక్ష్మి అభినందించారు.
సీఆర్ ఫౌండేషన్ మహిళా సంక్షేమ కేంద్రానికి ఎక్సలెన్సీ అవార్డు - cr foundation got excellence award
ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్సలెన్స్ అవార్డు... సీఆర్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మహిళ సంక్షేమ కేంద్రానికి దక్కింది. ఈ అవార్డు అందుకున్నందుకు గానూ... కేంద్రంలో పనిచేస్తున్న టీచర్లందరికీ ఏఐటీయూసీ కార్యదర్శి డా. బీవీ విజయలక్ష్మి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
15 ఏళ్లుగా మహిళల సంక్షేమానికి, ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తూనే... సామాజిక చైతన్యం కలిగించడానికి తరగతులు నిర్వహిస్తూ... స్వశక్తులుగా చేయడానికి కృషి చేస్తున్న సంక్షేమ కేంద్రం కమిటీ సభ్యుల కృషి ఫలించిందని అభిప్రాయపడ్డారు. ఎప్పుడైతే మహిళలు స్వయం ఉపాధి పొందుతారో.. అప్పుడే సాధికారత సాధ్యమవుతుందన్నారు. గృహహింస లాంటి వాటిని ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఇది మహిళా సంక్షేమ కేంద్రం సాధించిన విజయమని పేర్కొన్నారు. అవార్డు అందుకున్నందుకు కేంద్రంలో పనిచేస్తున్న టీచర్లందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.