రాష్ట్రంలో కొత్తగా 1863 కరోనా కేసులు.. 90వేలు దాటిన బాధితులు - కరోనా కేసులు తెలంగాణ
08:19 August 15
రాష్ట్రంలో కొత్తగా 1863 కరోనా కేసులు
రాష్ట్రంలో శుక్రవారం (14వ తేదీన) 1,863 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 90,259కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. శుక్రవారం ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 657కి చేరింది. తాజాగా 1,912 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 66,196కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,32,735కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 394, ఆదిలాబాద్లో 18, జగిత్యాల జిల్లాలో 61 , జనగామలో 34, జోగులాంబ గద్వాల జిల్లాలో 12, కరీంనగర్ జిల్లాలో 104, ఖమ్మం జిల్లాలో 61, మల్కాజ్‌గిరి జిల్లాలో 175, నాగర్ కర్నూల్ జిల్లాలో 24, నిజామాబాద్ లో 39, నల్గొండలో 49, పెద్దపల్లిలో 40, సిరిసిల్ల జిల్లాలో 90, రంగారెడ్డి జిల్లాలో 131, సంగారెడ్డి జిల్లాలో 81, సిద్దిపేటలో 60, సూర్యాపేటలో 33, ఉమ్మడి వరంగల్ 142 కేసులు ఉన్నాయి.