కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు విస్తృతంగా నిర్వహించనందు వల్లే తెలంగాణ వ్యాప్తంగా వైరస్ విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం: తమ్మినేని
తెలంగాణలో కరోనా నిర్ధరణ పరీక్షలు నామమాత్రంగా నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ మండిపడింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఆందోళనకు దిగింది.
హైదరాబాద్‌లో సీపీఎం ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ నిరసనకు దిగింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.. పొరుగు రాష్ట్రాల్లో కరోనా పరీక్షలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారని, తెలంగాణలోనూ కొవిడ్ పరీక్షలను విస్తృతంగా చేయాలని కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కేసీఆర్ సర్కార్.. తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.