తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా దోపిడీని అరికట్టాలి: రాఘవులు - cpm protest updates at koti dho office

కొవిడ్‌ వ్యాధికి మెరుగైన చికిత్స అందించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో కోఠిలోని డీహెచ్‌ ఆఫీస్‌ను రాఘవులు నేతృత్వంలో ముట్టడించారు.

cpm-protest-at-koti-dho-office-for-provide-better-treatment-to-covid-patients-in-telangana
కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: సీపీఎం

By

Published : Jun 27, 2020, 4:17 PM IST

కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు డిమాండ్‌ చేశారు. కేసులు పెరుగుతున్నందున సరైన వైద్య సదుపాయాలు కల్పించాలంటూ హైదరాబాద్‌లోని కోఠిలో డీహెచ్‌ ఆఫీస్‌ ముందు ధర్నా చేపట్టారు.

కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలన్న రాఘవులు.... ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేస్తున్న కరోనా దోపిడీని అరికట్టాలని కోరారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో వైరస్‌ నిర్ధరణ పరీక్షలు విస్తృతం చేయాలన్నారు. అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని సూచించారు. ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలను అదువులోకి తీసుకున్న పోలీసులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: సీపీఎం

ఇదీ చూడండి:టాయిలెట్ డిజైన్ చెప్పండి​.. రూ.15 లక్షలు గెలుచుకోండి!

ABOUT THE AUTHOR

...view details