దేశంలోని అనేక రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ నుంచి ప్రజలను రక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. సోషలిస్టు దేశాలు కరోనాను సమూలంగా నివారించాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ బహిరంగ సభ నిర్వహించారు.
దిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో బహిరంగ సభలో పాల్గొన్న సీతారాం ఏచూరి.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఒక్క మతానికి మాత్రమే కొమ్ముకాస్తుందని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని బలహీనం చేసి హిందూ దేశంగా మార్చడానికి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.