రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో సీపీఎం అభ్యర్థి నూతనగంటి శోభారాణి పురుషోత్తానికి ఓట్లు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోండిగారి రాములు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో సీపీఎం అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని రాములు అన్నారు.
'ఓటుకు నోట్లు ఇచ్చేవాళ్లని తరిమికొట్టండి' - రంగారెడ్డి జిల్లాలో సీపీఎం ప్రచారం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకుండా ఓటుకు నోట్లు ఇచ్చే పార్టీల నాయకులను తరిమికొట్టాలని మాజీ ఎమ్మెల్యే రాములు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
'ఓటుకు నోట్లు ఇచ్చేవాళ్లని తరిమికొట్టండి'
ప్రజల అభివృద్ధికి పాటుపడే వ్యక్తులనే గెలిపించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయోద్దని చెప్పారు. ఓటుకు నోట్లు ఇచ్చే పార్టీ నాయకులను తరిమికొట్టాలని అన్నారు.
ఇదీ చూడండి: 'అబ్బాయిలను ట్రాప్ చేస్తే... అమ్మాయిలపై కేసులు పెట్టరా?'
Last Updated : Jan 13, 2020, 4:21 PM IST