రాష్ట్ర వ్యాప్తంగా.. అనేక సార్లు వ్యవసాయ కూలీలు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. రోడ్డు భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే పూర్తి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలి: సీపీఐ - Chada Venkat Reddy mourns the death of Nalgonda workers
నల్గొండ జిల్లా అంగడిపేట రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నల్గొండ ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం
నల్గొండ జిల్లా అంగడిపేట ప్రమాదంలో 9 మంది కూలీలు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని చాడ అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని కోరారు. మృతులకు సంతాపం ప్రకటించారు.
- ఇదీ చూడండి :'సీరంలో ప్రమాదంతో ఆ టీకాల ఉత్పత్తిపై ప్రభావం'