శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం అగ్నిప్రమాద ఘటనలో బాధితులకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. దశాబ్దాలుగా వెలుగులు అందిస్తున్న విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడం బాధాకరమన్నారు. కారణాలపై విచారణ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
'శ్రీశైలం అగ్నిప్రమాద బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి' - ex gratia for srisailam power plant fire accident victims
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనపై విచారణ వేగవంతం చేయాలని కోరారు.
'శ్రీశైలం అగ్నిప్రమాద బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి'
TAGGED:
శ్రీశైలం బాధితులకు పరిహారం