ముఖ్యమంత్రి కేసీఆర్ తన మౌనం వీడి... రైతుల పక్షమా, నరేంద్రమోదీ పక్షమా చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతును రాజును చేస్తామని చెప్పిన మాట ఏమైందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారాయని మండిపడ్డారు. దిల్లీలో మోదీని కలిసి వచ్చిన తరువాత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందన్నారు. కొత్త చట్టాలు కార్పొరేట్‌లకు అనుకూలమైన చట్టాలని ఆయన అభివర్ణించారు.
కేసీఆర్ రైతుల పక్షమా.. మోదీ పక్షమా?: చాడ - తెలంగాణ వార్తలు
పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ విషయంలో కేసీఆర్ ముందు వ్యతిరేకించి తరువాత మద్దతు ఇచ్చారని.. అదే విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ తన మౌనం వీడాలన్నారు. రైతుల పక్షమా, నరేంద్రమోదీ పక్షమా చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతుల పక్షమా, ప్రధాని మోదీ పక్షమా?: చాడ
ఈ చట్టాల వలన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ చర్చల పేరుతో కాలయాపన చేస్తూ... మాటల ద్వారా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో కొత్త చట్టాలను వ్యతిరేకించిన మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ విషయంలో కేసీఆర్ ముందు వ్యతిరేకించి తరువాత మద్దతు ఇచ్చారని.. అదే విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు.
ఇదీ చూడండి: 'దేశవ్యాప్త పోరుకు న్యాయశాఖ ఉద్యోగుల సన్నద్ధం'