తెలంగాణ

telangana

ETV Bharat / city

'కొత్త చట్టాలు రద్దు చేసేంత వరకు పోరాడతాం' - Telangana news

సాగుచట్టాలు రద్దు చేయాలని అఖిలపక్ష రైతుసంఘాల ఆందోళనకు దిగారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

cpi protest against new agricultural acts at tank bund Hyderabad
'కొత్త చట్టాలు రద్దు చేసేంత వరకు పోరాడతాం'

By

Published : Jan 5, 2021, 4:12 AM IST

సాగుచట్టాలు రద్దు చేయాలని.. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్​లో అఖిలపక్ష రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. అఖిల భారత రైతు సమన్వయ కమిటీ పిలుపు మేరకు ట్యాంక్​బండ్​పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించిన వారు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త చట్టాలు రద్దు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను అమలు చేయకుంటే సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లాంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేస్తోందని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ వ్యవస్థని భాజపా సంఘ్‌ పరివార్‌ వ్యవస్థగా చేసిందని రాఘవులు ధ్వజమెత్తారు. రైతు చట్టాలపై తెరాస పునరాలోచించాలని తెలిపారు. తెరాస ప్రభుత్వం కొన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భాజపాను నిరోధించడం కోసం లౌకిక శక్తులు ఏకం కావాలన్నారు..

ఇవీ చూడండి:భాజపా ఎస్సీ మోర్చా నాయకులు ఆందోళన.. అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details