తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా వేళ జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలి: నారాయణ - క్షమాభిక్ష కోసం నారాయణ విజ్ఞప్తి

జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ నేత నారాయణ విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధాని కొనసాగించాలని చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

cpi national secretery narayana request to government release prisoners
జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టండి: నారాయణ

By

Published : Jul 4, 2020, 3:20 PM IST

జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేల సంఖ్యలో ఖైదీలు జైళ్లల్లో ఉండిపోయారని... అక్కడ కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశాలుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంత వరకు ఖైదీలకు క్షమాభిక్ష పెట్టలేదని గుర్తు చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని 200 రోజులుగా జరుగుతున్న పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టండి: నారాయణ

ఇదీ చూడండి:బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ

ABOUT THE AUTHOR

...view details