తెలంగాణ

telangana

ETV Bharat / city

'మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసమేనా ఆ లేఖ!' - cpi national secretary narayana updates on kcr

8వ తేదీన భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేసి.. ఆ మరుసటి రోజే ప్రధానిని అభినందిస్తూ కేసీఆర్ లేఖ రాయడమేంటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రశ్నించారు. ఇది మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసమే తప్ప మరొకటి కాదని ఆయన ఆక్షేపించారు.

cpi national secretary narayana on kcr
'మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసమేనా ఆ లేఖ!'

By

Published : Dec 10, 2020, 4:41 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వెళ్తున్నందున రైతు ఉద్యమ కార్యాచరణ కమిటీని కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కోరారు. రాష్ట్ర సీఎంగా దిల్లీకి వెళ్లి ప్రధాని కలవడం మంచిదేనని వ్యాఖ్యానించారు.

"రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ కేసీఆర్​ రైతులకి మద్దతిచ్చారు. 8వ తేదీన భాజపాకు వ్యతిరేకంగా తెరాస నినాదాలు చేసింది. మరుసటి రోజే ప్రధానిని అభినందిస్తూ కేసీఆర్ లేఖ రాయడమంటే.. మోదీని ప్రసన్నం చేసుకోవడమే తప్ప మరొకటి కాదు. ఆ లేఖలో ఉన్న ఆంతర్యమేంటో చెప్పాలి."

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details