రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. నారాయణ భాజపాలో చేరుతున్నారని పువ్వాడ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. నాలుగు పార్టీలు మారి, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మంత్రి అయిన మీరు... నా గురించి మాట్లాడతారా అని విమర్శించారు.
నేనా.. భాజపాలోకా..?: సీపీఐ నారాయణ - మంత్రి పువ్వాడ అజయ్‌పై సీపీఐ నారాయణ ఆగ్రహం
ఒక పార్టీలో గెలిచి... మరో పార్టీలో మంత్రి అయిన చరిత్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అజయ్ కుమార్ చేసిన విమర్శలను నారాయణ ఖండించారు.
నేనా.. భాజపాలోకా..?: సీపీఐ నారాయణ
రాజకీయ అనైతిక చరిత్ర మీదైతే... రాజకీయ స్వచ్ఛమైన చరిత్ర తనదని నారాయణ దుయ్యబట్టారు. తనపైన బుదరచల్లాలని చూస్తే... సూర్యుడిపై ఎంగిలి విసిరినట్లు అవుతుందన్నారు.
ఇదీ చూడండి:'వాళ్లు రిగ్గింగ్ చేసినా... గెలిచేది మాత్రం మేమే'
Last Updated : Dec 2, 2020, 4:35 PM IST