హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తెరాస గెలుపొందటం వల్ల సీఎం కేసీఆర్కు అహంభావం పెరిగిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సాధారణమేనని పేర్కొన్నారు. తెరాస అధికార దుర్వినియోగం, డబ్బు పంపిణీ చేసినప్పటికీ కాంగ్రెస్‌కు అధికంగానే ఓట్లు వచ్చాయన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ అన్యాయంగా మాట్లాడడం తగదని హితవు పలికారు. కార్మికుల డిమాండ్లను పరిశీలిస్తే ఆర్టీసీ బలోపేతమవుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీకి నష్టం రావడానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలే కారణమని నారాయణ తెలిపారు.
'హుజూర్‌నగర్ గెలుపుతో కేసీఆర్కు అహంభావం పెరిగింది' - cpi narayana on tsrtc strike
ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సాధారణమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈ గెలుపుతో సీఎం కేసీఆర్కు అహంభావం పెరిగిందని ఆరోపించారు.
narayana