తెలంగాణ

telangana

ETV Bharat / city

CPI narayana: ఆంధ్రప్రదేశ్​లో ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. కలిసి పోరాడుదాం: సీపీఐ - ap latest political news

తెదేపా అధినేత చంద్రబాబుకు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫోన్ చేశారు. బాబు చేస్తున్న36 గంటల దీక్షకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన ఆయన.. పలు విషయాలు మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబుకు సూచించారు.

CPI narayana
CPI narayana

By

Published : Oct 22, 2021, 5:18 PM IST

ఏపీలోని తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు చేస్తున్న 36 గంటల నిరాహార దీక్షకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం తెలిపారు. ఈ మేరకు.. తెదేపా అధినేతకు ఫోన్ చేసి మాట్లాడారు. వ్యక్తిగత పనుల కారణంగానే తాను దీక్షా స్థలికి రాలేకపోయినట్లు వివరించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ నేత నారాయణ అన్నారు. అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబుకు సూచించారు.

ఖబడ్దార్‌ అంటూ డీజీపీని హెచ్చిరించిన తెదేపా అధినేత...

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, డీజీపీ సరిదిద్దుకోలేని తప్పు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా. ఖబడ్దార్‌.. జాగ్రత్తగా ఉండండని హెచ్చరించారు. ‘తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపించి.. నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. మీరు చేసిన చట్టవ్యతిరేక కార్యక్రమాలకు శిక్ష పడేవరకు వదిలిపెట్టను’ అని విరుచుకుపడ్డారు. గురువారం ఉదయం 36 గంటల దీక్షను చేపట్టిన ఆయన.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లపై నిప్పులు చెరిగారు. ‘ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని చూశాం. కానీ ఈ సీఎం ఆలోచనల్లోనే లోపం ఉంది. ఇలాంటి వాళ్లను సరిచేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. తెదేపా కార్యాలయంపై దాడి అనంతరం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని మీడియా సాక్షిగా చూపించి.. పోలీసులకు అప్పగించాం. ఫొటోలతో ఫిర్యాదు కూడా చేశాం. తర్వాత ఆ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా మాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. మేం అతన్ని కొట్టామా? మీ అధికారి మా అనుమతి లేకుండా మా కార్యాలయానికి ఎందుకొచ్చారు? మమ్మల్ని కొట్టి మాపైనే కేసులు పెట్టే వ్యవస్థకు ఈ డీజీపీ నాంది పలికారు.. తెదేపా కార్యాలయంపై దాడికి పంపడానికి ఈ డీజీపీకి ఎంత ధైర్యం ఉండాలి?’ అని ధ్వజమెత్తారు.

ఇదీ చూడండి:Chandrababu: ఖబడ్దార్‌ జాగ్రత్తగా ఉండండి... మీరు సరిదిద్దుకోలేని తప్పు చేశారు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details