సొంత ఊరిలో పలుగు పార చేతపట్టి.. ఉపాధిహామీ కూలీగా మారారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి మండలం ఐనంబాకంలో రెండు రోజుల పాటు ఉపాధి హామీ కూలీ పనుల్లో పాల్గొన్న నారాయణ.. చెరువు పూడికతీత పనుల్లో భాగస్వామ్యం అయ్యారు.
పలుగు, పార చేతపట్టి.. కూలీగా మారిన సీపీఐ నారాయణ..! - cpi leader in manrega works as a worker
ఉపాధి హామీ కూలీల వెతలు తెలుసుకునేందుకు స్వయంగా కూలీ అవతారమెత్తారు సీపీఐ నేత నారాయణ. స్వగ్రామంలో పలుగు పట్టి వారిలో ఒకడిగా మారిపోయారు. పనులు చేసేవారి ఆరోగ్య పరిరక్షణకు కొన్ని సూచనలు చేశారు.
![పలుగు, పార చేతపట్టి.. కూలీగా మారిన సీపీఐ నారాయణ..! cpi narayana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11666500-326-11666500-1620312513616.jpg)
పలుగు, పార చేతపట్టి.. కూలీగా మారిన సీపీఐ నారాయణ..!
కూలీల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. తన అనుభవాలు పంచుకున్నారు. ఉపాధి పనుల్లో కూలీల ఆరోగ్య పరిరక్షణ కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్‌లు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని కోరారు. పూడిక తీసిన మట్టిని చెరువులకు దూరంగా వేయించాలని సూచించారు. సొంత ఊరి చెరువు పనుల్లో పాల్గొనడం సంతృప్తినిచ్చిందని నారాయణ తెలిపారు.
పలుగు, పార చేతపట్టి.. కూలీగా మారిన సీపీఐ నారాయణ..!
ఇదీ చదవండి: ఏపీలో కొత్తగా 21,954 కరోనా కేసులు, 72 మరణాలు