తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీసుల నిర్లక్ష్యంతోనే హేమంత్​ హత్య: నారాయణ - హేమంత్​ది సర్కార్ హత్యగా అభివర్ణించిన నారాయణ

హేమంత్ హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. పోలీసుల వైఫల్యంతోనే హత్య జరిగిందని ఆరోపించారు. మూడు నెలల క్రితమే ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

cpi national secretary narayana allegation on police in hemanth murder
పోలీసుల నిర్లక్ష్యంతోనే హేమంత్​ హత్య: నారాయణ

By

Published : Sep 28, 2020, 6:55 PM IST

Updated : Sep 28, 2020, 7:49 PM IST

హేమంత్ హత్యకు గురవ్వడంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. చందానగర్‌‌లోని హేమంత్ నివాసానికి వచ్చిన నారాయణ... కుటుంబసభ్యులను పరామర్శించారు.

జూన్ 16 తర్వాత తమకు ప్రాణహాని ఉందని అవంతి పోలీసులకు ఫిర్యాదు చేసినా... పట్టించుకోలేదని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుపడేదిగా ఉందన్న నారాయణ... ఇది సర్కారు హత్యగా అభిప్రాయపడ్డారు. ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

పోలీసుల నిర్లక్ష్యంతోనే హేమంత్​ హత్య: నారాయణ

ఇదీ చూడండి:పరువు హత్య: పరారీలో ఉన్న కీలక నిందితుల అరెస్ట్

Last Updated : Sep 28, 2020, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details