CPI Narayana About KTR Statements : 'పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవు... రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి' అని మంత్రి కేటీఆర్... ఏపీపై చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లలో గతుకులు, గుంతలు మీదపై, అప్రకటిత విద్యుత్ కోతలు మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనన్నారు. కేటీఆర్ మాటలను ఏపీ మంత్రులు తప్పుబడుతున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వయంగా ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో పర్యటించి ఆంధ్ర రోడ్ల స్థితిగతులను, తమిళనాడు పరిస్థితులతో పోల్చి ఆధారాలతో సహా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల స్థితి గుంతలమయంగా ఉందని.. తమిళనాడు రోడ్లు చక్కగా ఉన్నాయని చూపించారు. రెండింటి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఘాటుగా విమర్శించారు. నగరి మండలం తన స్వగ్రామమైన అయణంబాకం గ్రామానికి వచ్చే రోడ్ల చూడండని దృశ్యాలతో సహా వెల్లడించారు.
KTR comments on AP : క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ పరిస్థితిపై తన మిత్రులు చెప్పిన మాటలను ఆయన ప్రస్తావించారు.