తెలంగాణ

telangana

ETV Bharat / city

దేశాన్ని మోదీ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తున్నారు : డి. రాజా - కేంద్ర బడ్జెట్​-2021

కేంద్ర బడ్జెట్​పై సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా స్పందించారు. లాక్​డౌన్​ తర్వాత మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్​ ప్రజలను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని అభిప్రాయపడ్డారు. దేశాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పుతున్నారని ఆరోపించారు.

cpi national secretary d raja comments on central budget
దేశాన్ని మోదీ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పుతున్నారు: డి. రాజా

By

Published : Feb 1, 2021, 4:00 PM IST

నిర్మలాసీతారామన్ పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన బడ్జెట్​... కార్పోరేట్​ శక్తులకు కొమ్ముకాసేదిగా ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా విమర్శించారు. ప్రధాని మోదీ కార్పొరేట్ హౌస్​లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మక్దూం భవన్​లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన... లాక్​డౌన్​ తర్వాత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజలను నిరుత్సాహపరిచిందని ఆక్షేపించారు. దిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసనకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు.

వ్యవసాయాన్ని, రైల్వేను ప్రైవేట్​ వ్యక్తులకు అప్పజెప్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో జరిగే సీపీఐ జాతీయ మహాసభలను విజయవాడలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మతతత్వ శక్తులపై పోరాడేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణలో భాజపా గందరగోళం సృష్టించాలని చూస్తోందని... దాడులు-ప్రతిదాడులు మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్​లో స్థానిక ఎన్నికలకు రీ-నోటిఫికేషన్ ఇచ్చి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఆ రాష్ట్ర కార్యదక్ళి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:ఇది సామాన్యుడికి అండగా నిలిచే బడ్జెట్‌: ప్రధాని

ABOUT THE AUTHOR

...view details