'బిగ్‌బాస్' వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగంలేదని.. ఏ సంస్కృతిని ఇది ప్రతిబింబిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. బూతుల ప్రపంచాన్ని వందల కోట్ల వ్యాపారానికి ఉపయోగపడేట్లు అనుమతించడం ఘోరమన్నారు. కోర్టులో వ్యాజ్యం వేస్తే కూడా న్యాయ వ్యవస్థ ఎలాంటి సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్ట ప్రభుత్వం ఇలాంటి వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు.
'బిగ్‌బాస్'పై సీపీఐ నారాయణ సీరియస్ - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
'బిగ్‌బాస్' కార్యక్రమంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగంలేదని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఇలాంటి వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు.
cpi narayana on bigboss