తెలంగాణ

telangana

ETV Bharat / city

'వలస, పేద కార్మికులకు సాయం అందడం లేదు' - సీపీఐ నారాయణ ఇంట్లో లెనిన్ జయంతి వేడుకలు

గతంలో దేశవ్యాప్తంగా లెనిన్ జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున జరపాలని పిలుపునిచ్చామని... కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోనే జరుపుకుంటున్నామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ.

Cpi narayana on lenin jayanthi
'వలస, పేద కార్మికులకు సాయం అందడం లేదు'

By

Published : Apr 22, 2020, 1:52 PM IST

లాక్​డౌన్​లో వలస, పేద కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి పూర్తి స్థాయిలో సాయం జరగడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కామ్రెడ్ లెనిన్ 150 జయంతిని తన ఇంటిలోనే నిర్వహించారు. గతంలో దేశవ్యాప్తంగా లెనిన్ జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున జరపాలని పిలుపునిచ్చామని... కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోనే జరుపుకుంటున్నామన్నారు. ఇది కరోనాపై పోరాడాల్సిన సమయమని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details