గతంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో తన వ్యాఖ్యలతో మీడియాలో కనిపించేవారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. ప్రజా సమస్యలపై తన నిరసనను ఎల్లప్పుడూ తెలిపేవారు. ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చింది. గిటార్‌తో ఫోజ్ ఇచ్చిన ఫొటో ఆకట్టుకుంటోంది. ధర్నాలు, పోరాటాలతో కనిపించే ఈ డియర్ 'కామ్రేడ్'.. కొత్త లుక్ ఆసక్తి రేకిత్తిస్తోంది. రాక్ స్టార్ ఫొటోలో నారాయణ మెరిసిపోతున్నారు.
గిటార్ పట్టిన డియర్ 'కామ్రేడ్'! - cpi
సీపీఐ నారాయణ.. ఎప్పుడూ... ప్రజల మధ్యే ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తి. సమస్యల పరిష్కారానికి నిరసనలు.. ఆందోళనలు.. ఇదే ఆయన జీవితం. కానీ ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చింది. కొత్త లుక్‌తో ఉన్న ఆ గెటప్ ఆకట్టుకుంటోంది.
గిటార్ పట్టిన డియర్ 'కామ్రేడ్'!