దేశంలోని సామాజిక, ఆర్థిక స్థితిగతులు, ఇతర దేశాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసి దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అంబేడ్కర్ అందించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత 129వ జయంతి సందర్భంగా హిమాయత్ నగర్‌లోని మక్దుం భవన్లో కార్యక్రమం నిర్వహించారు.
అంబేడ్కర్‌కు నివాళి అర్పించిన చాడ, రామకృష్ణ - సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఐపీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల కార్యదర్శులు చాడ, రామకృష్ణ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
![అంబేడ్కర్‌కు నివాళి అర్పించిన చాడ, రామకృష్ణ CPI LEADERS TRIBUTE TO AMBEDKER ON HIS BIRT ANNIVERSARY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6792548-1089-6792548-1586875563782.jpg)
అంబేడ్కర్‌కు నివాళి అర్పించిన చాడ, రామకృష్ణ
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, రామకృష్ణ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భాజపా కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కార్పొరేట్ సంస్థలు పెరిగి.. సహజ వనరులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. భావస్వేచ్ఛకు భంగం కలిగించడం.. పౌరహక్కుల నేతలను అక్రమ అరెస్టులు చేసి జైళ్లలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.