కొవిడ్ ముసుగులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రహస్య ఏజెండాను అమలుచేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సచివాలయం కూల్చివేత, మూడు రాజధానుల నిర్మాణం ఇందులో భాగమేనన్నారు. కరోనాను కట్టడి చేయలేక కేసీఆర్ ఫౌంహౌస్‌కే పరిమితమయ్యారని నారాయణ విమర్శించారు. కొవిడ్‌పై సమీక్షలు మానేసి.. సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై దృష్టిసారించారని మండిపడ్డారు.
మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రత్యర్థులపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏపీ ప్రభుత్వం చంపేసేలా ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.