కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోని అన్ని బ్యాంకులను కుదించి నాలుగు బ్యాంకులు చేసి... ఇప్పుడు ఉన్న బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలందరు పోరాటం చేస్తుంటే.. బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం దారుణం: నారాయణ - telangana varthalu
బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం దారుణమని కేంద్రంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.
బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం దారుణం: నారాయణ
అప్పులను ఎగ్గొట్టే వారిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా... ఆ నెపం బ్యాంకులపై వేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం అంటే బంగారు కోడిని రోజు కోసుకొని తినడమే అని పేర్కొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల