అదానీ, అంబానీల కంపెనీలలో భాజపా నేతల షేర్లు ఉన్నాయని... అందుకే వారిద్దరికీ ప్రాధాన్యత పెరిగిందని, వారి కంపెనీలకే ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కట్టపెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. అదానీ, అంబానీలకు దోచిపెట్టడానికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు ఊతమిస్తూ... సహజ వనరులను కట్టబెడుతున్నారన్నారు.
'మోదీ గద్దె దిగే వరకు పోరాటాలు కొనసాగిస్తాం' - cpi rally in hyderabad
భారత్ బంద్‌కు మద్దతుగా... హైదరాబాద్ హిమాయత్‌నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అదానీ, అంబానీలకు దోచిపెట్టడానికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, జీఎస్టీ తగ్గించే వరకు పోరాటాలు ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, జీఎస్ పెంచడానికి నిరసనగా వ్యాపారులు ఇచ్చిన భారత్ బంద్‌కు మద్దతు తెలుపుతూ... హైదరాబాద్ హిమాయత్‌నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్ఠం చేస్తే... నరేంద్ర మోదీ అమ్మేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ మోసాలు సాగనివ్వమని... గద్దె దిగేవరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. పెట్రోల్, డీజిల్, జీఎస్టీ తగ్గించే వరకు పోరాటాలు ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.