సమాజంలో దివ్యాంగులకు తగిన రీతిలో గౌరవం దక్కడం లేదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. దివ్యాంగుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ తరఫున తమ సహాయ సహకారాలను అందిస్తామని సజ్జనార్ వెల్లడించారు. మలక్‌పేటలోని పిన్ బధిరుల ఆశ్రమ పాఠశాల 14వ వార్షికోత్సవానికి సజ్జనార్, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, దేవీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
దివ్యాంగులకు తగిన గౌరవం దక్కడం లేదు: సీపీ సజ్జనార్ - హైదరాబాద్ వార్తలు
మలక్‌పేటలోని పిన్ బధిరుల ఆశ్రమ పాఠశాలలో 14వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, దేవీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దివ్యాంగుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ తరఫున తమ సహాయ సహాకారాలను అందిస్తామని సజ్జనార్ పేర్కొన్నారు.

దివ్యాంగులకు తగిన గౌరవం దక్కడం లేదు: సీపీ సజ్జనార్
సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐటీ కంపెనీల ద్వారా దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామని సీపీ పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పిన్ బధిరుల పాఠశాలను నడుపుతున్న జానకి, సిబ్బందిని సీపీ అభినందించారు.