తెలంగాణ

telangana

ETV Bharat / city

సీపీ సజ్జనార్​ చేతుల మీదుగా టాటా సఫారీ రీజినల్​ ఆవిష్కరణ - సైబరాబాద్ సీపీ సజ్జనార్

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని వెంకటరమణ మోటార్స్​లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ చేతుల మీదుగా టాటా సఫారీ రీజినల్​ ఆవిష్కరణ జరిగింది. టాటా కార్లలో వరల్డ్ క్లాస్ సేఫ్టీ ఉంటుందని, కుటుంబం అంతా సేఫ్​గా ప్రయాణం చేయొచ్చని సజ్జనార్‌ అన్నారు.

cp sajjanar launch tata safari reginal in gacchibowli
cp sajjanar launch tata safari reginal in gacchibowli

By

Published : Feb 24, 2021, 2:07 PM IST

టాటా మోటార్స్ నుంచి వచ్చిన సరికొత్త ఎస్​యూవీ వెహికల్ - టాటా సఫారీ రీజినల్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్​ గచ్చిబౌలిలోని వెంకటరమణ మోటార్స్​లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ చేతుల మీదుగా అట్టహాసంగా జరిగింది. టాటా మోటార్స్ రీజనల్ ఎండీ నితుల్ శర్మ సమక్షంలో టాటా సఫారీని హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేశారు. టాటా సఫారీని లాంచ్​ చేయటం సంతోషంగా ఉందని సీపీ తెలిపారు. టాటా కార్లలో వరల్డ్ క్లాస్ సేఫ్టీ ఉంటుందని, కుటుంబం అంతా సేఫ్​గా ప్రయాణం చేయవచ్చని సజ్జనార్‌ అన్నారు.

టాటా కార్లలో మోస్ట్ అడ్వంచర్స్ ఎస్​యూవీగా ఇండియన్ మార్కెట్లో పేరు సంపాదించిన టాటా సఫారీకి... లేటెస్ట్ టెక్నాలజీని జోడించి యంగర్ జనరేషన్​ను ఆకట్టుకునేలా రూపొందించినట్లు ఎండీ నితుల్ శర్మ తెలిపారు. సేఫ్టీ పరంగా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఏబీఎస్ విత్ ఈబీడీ, 6 ఎయిర్ బ్యాగ్స్‌ని జోడించినట్లు వెంకటరమణ మోటర్స్‌ ఎండీ రాజేందర్‌ తెలిపారు. క్రయోటెక్ 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్​ని ఇది కలిగి ఉందన్నారు.

ఇదీ చూడండి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్​ఎంసీ అధికారి

ABOUT THE AUTHOR

...view details