రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండో దశ లాక్డౌన్ విధించిన మొదటి రోజు నుంచి నేటి వరకు 25 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈసీఐఎల్ తనిఖీ కేంద్రాన్ని మహేశ్‌భగవత్ పరిశీలించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.
ఉల్లంఘనులపై ఉక్కుపాదం.. రాచకొండలో 25 వేలకు పైగా కేసులు
హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈసీఐఎల్ తనిఖీ కేంద్రాన్ని సీపీ మహేశ్‌భగవత్ పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు 25 వేలకు పైగా కేసులు నమోదైనట్టు సీపీ తెలిపారు. అందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు.
cp mahesh bhagwat visited kushaiguda police check post
అనుమతి లేకుండా బయటకు వచ్చినా, మాస్కు ధరించకపోయినా, భౌతిక ధూరం పాటించకపోయినా కేసులు నమోదు చేస్తున్నట్లు మహేశ్‌భగవత్ తెలిపారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ... పోలీసులకు సహకరించాలని సూచించారు.