కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ను కచ్చితంగా అమలు చేసేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ కోరారు. ఉప్పల్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో లాక్‌డౌన్ పరిస్థితిని ఆయన పరిశీలించారు.
ఉప్పల్లో లాక్‌డౌన్ పరిస్థితిని పరిశీలించిన సీపీ మహేశ్ భగవత్ - రాచకొండ సీపీ మహేశ్ భగవత్
లాక్‌డౌన్ ప్రభావంతో నగరంలో అన్ని చోట్ల దుకాణాలు మూసివేశారు. పోలీసులు రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉప్పల్లో లాక్‌డౌన్ అమలును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పర్యవేక్షించారు.
ఉప్పల్లో లాక్‌డౌన్ పరిస్థితిని పరిశీలించిన సీపీ మహేశ్ భగవత్
వ్యాపార సముదాయాలు ఉదయం పది గంటలకే మూసివేయాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రైతు బజార్, రేషన్ దుకాణాలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు. వాటికి గుంపులుగా వెళ్లకూడదని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 9490617234కు ఫోన్ చేయాలని సీపీ కోరారు.
ఇదీ చూడండి:లైవ్అప్డేట్స్:రాష్ట్రంలో పలుచోట్ల వలస కార్మికుల ఇబ్బందులు