డిసెంబర్ 4న జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ స్కూల్లో కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్‌రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ మహేశ్‌భగవత్ - జీహెచ్ఎంసీ ఎన్నికల వార్తలు
హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలోని కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్‌రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
![కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ మహేశ్‌భగవత్ cp mahesh bhagavath inspected counting centers in hayathnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9741382-50-9741382-1606917275184.jpg)
cp mahesh bhagavath inspected counting centers in hayathnagar
నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ల కౌంటింగ్ కోసం వర్డ్ అండ్ డీడ్ పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. సీపీ మహేష్ భగవత్ వెంట స్థానిక ఏసీపీ, సీఐ, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.
ఇదీ చూడండి:లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత