రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్లో పోలీసుల సోదాలు నిర్వహించారు. సుమారు 54 మంది బాలకార్మికులు ఉన్నట్లు గుర్తించారు. బీహార్ నుంచి వచ్చిన పిల్లల చేత గాజులు తయారు చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు పనిచేయిస్తున్నారని, సరైన భోజనం, వసతి సమకూర్చలేదని తేల్చారు. పిల్లలందరిని సైదాబాద్ హోంకు తరలించారు. విచారణ అనంతరం వారిని స్వరాష్ట్రానికి పంపిస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
బాలాపూర్లో సోదాలు.. 54 మంది బాలకార్మికుల గుర్తింపు - సీపీ మహేశ్ భగవత్
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్లో మైనర్ బాలలతో పని చేయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 54 మంది పిల్లలతో గాజులు తయారు చేయిస్తున్నారని గుర్తించారు. వారందరిని సైదాబాద్ హోంకు తరలించారు.
బాలాపూర్లో సోదాలు.. 54 మంది బాలకార్మికుల గుర్తింపు