తెలంగాణ

telangana

ETV Bharat / city

'గణేశ్​ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగడానికి పటిష్ఠమైన చర్యలు' - ganesh festival news

నగరంలో గణేశ్​ శోభాయాత్ర, సామూహిక నిమజ్జనం కార్యక్రమాలు శాంతియుతంగా జరిగేలా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేస్​సాగర్​ పరిసర ప్రాంతాలను సీపీ అంజనీకుమార్​ పరిశీలించారు. సామూహిక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగడానికి పోలీసు సిబ్బంది సమన్వయంగా వ్యవహరించాలని అడిషనల్​ సీపీ షికాగోయల్​ తెలిపారు.

cp-anjanikumar-visited-tankbund
cp-anjanikumar-visited-tankbund

By

Published : Sep 1, 2020, 3:52 PM IST

హైదరాబాద్​లో జరుగుతున్న వినాయక శోభయాత్రను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్ ద్వారా ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్ కుమార్​తో పాటు పలువురు ఉన్నతాధికారులతో అంజనీకుమార్ నిమజ్జనం కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఖైరతాబాద్ గణేషున్ని ఎన్టీఆర్‌ పార్కు ముందున్న క్రేన్ నెంబర్ 4వ వద్ద నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాలను సీపీ పరిశీలించారు.

పోలీసు సిబ్బంది సమన్వయంగా వ్యవహరించి సామూహిక గణేశ్​ నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా చూడాలని అడిషనల్ సీపీ షికా గోయల్ తెలిపారు. ట్యాంక్​బండ్​పై గణేశ్​ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగడానికి పటిష్ఠమైన చర్యలు తీసుకున్నట్లు షికా గోయల్ వివరించారు. వినాయక విగ్రహాలతో వచ్చే భక్తులు, నిర్వాహకుల పట్ల పోలీస్ సిబ్బంది సమన్వయంగా వివరించాలని సూచించారు.

ఇదీచూడండి..' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'

ABOUT THE AUTHOR

...view details