కొద్ది రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్లో నిందితుడు రంగయ్య మృతిచెందాడు. లాక్ డెత్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయమై న్యాయవాది నాగమణి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
సమయం ఇవ్వండి: సీపీ అంజనీ కుమార్ - హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వార్తలు
పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్లో నిందితుడి రంగయ్య లాకప్ డెత్ ఆరోపణలపై నివేదిక సమర్పించేందుకు పది రోజుల సమయం కావాలని విచారణ అధికారి సీపీ అంజనీ కుమార్ హైకోర్టును కోరారు. లాకప్‌డెత్‌పై న్యాయవాది నాగమణి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారించింది.
సమయం ఇవ్వండి: అంజనీ కుమార్
ఈ ఘటనపై నివేదిక సమర్పించేందుకు పది రోజులు సమయం కావాలని విచారణాధికారి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హైకోర్టును కోరారు. లాక్డౌన్ అమలులో నిమగ్నమై ఉన్నందున మంథని వెళ్లి విచారణ జరపలేక పోయినట్లు హైకోర్టుకు నివేదించారు. మరో పది రోజుల సమయం ఇవ్వాలని కోరారు. అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:'మరో 80 ఏళ్లలో భారత్‌కు పెను ముప్పు