తెలంగాణ

telangana

ETV Bharat / city

Mega Job Mela: 'హైదరాబాద్​ యువత దేశానికే ఆదర్శంగా నిలవాలి'

హైదరాబాద్​ పాతబస్తీ చాంద్రాయన్​గుట్టలో దక్షిణ మండలం పోలీసులు ఏర్పాటు చేసిన మెగా జాబ్‌ మేళా(mega job mela)ను పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. జాబ్‌ మేళాకు 4 వేల మంది యువతీయువకులు పాల్గొనగా.. 20 ప్రైవేటు కంపెనీలు హాజరయ్యాయి.

cp anjani kumar started police conducting Mega Job Mela in old city
cp anjani kumar started police conducting Mega Job Mela in old city

By

Published : Nov 27, 2021, 6:08 PM IST

హైదరాబాద్ నగర యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆకాంక్షించారు. ఇందుకోసం పోలీసులు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు. గత మూడేళ్లల్లో నగరంలోని 21వేల మంది యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. హైదరాబాద్​ పాతబస్తీ చాంద్రాయన్​గుట్టలోని ఓ ఫంక్షన్ హాల్లో దక్షిణ మండలం పోలీసులు ఏర్పాటు చేసిన మెగా జాబ్‌ మేళా(mega job mela)ను పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు.

యువతికి జాబ్​ అపాయింట్​మెంట్​ లెటర్​ అందిస్తోన్న సీపీ

జాబ్‌ మేళా(mega job mela)కు 4 వేల మంది యువతీయువకులు పాల్గొనగా.. 20 ప్రైవేటు కంపెనీలు హాజరయ్యాయి. సుమారు 1000 మందికి ఉద్యోగాలు లభించాయని సీపీ వెల్లడించారు. మరో 2వేల మందికి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్ ప్రధాన కార్యాలయం అదనపు సీపీ విక్రమ్‌సింగ్ మాన్‌, దక్షిణ మండలం డీసీపీ గజారావు భూపాల్‌, టీఎంఐ గ్రూప్‌ జనరల్ మేనేజ్ అర్చనా సామ్‌టెని తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details