ప్రజలందరూ నిబంధనలు పాటిస్తే... కరోనాను అరికట్టవచ్చని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సూచించారు. కరోనా బాధితుల కోసం కింగ్ కోఠిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన... హెల్ప్‌డెస్క్‌ను అదనపు సీపీ విశ్వప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేంద్రనాథ్‌తో కలిసి ప్రారంభించారు. హెల్ప్‌డెస్క్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని అంజనీకుమార్ సూచించారు. నిత్యం రద్దీగా ఉండే కింగ్‌కోఠి ఆసుపత్రిలో అడ్మిషన్స్, ఓపీ, వ్యాక్సిన్ వంటి వాటికి ఎటువైపు వెళ్లాలి అనే అంశాలపై అయోమయంగా ఉంటారని... వారి సౌకర్యం కోసం ఈ కేందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
కింగ్ కోఠి ఆస్పత్రిలో హెల్ప్‌డెస్క్ ప్రారంభించిన సీపీ
హైదరాబాద్ కింగ్ కోఠిలోని జిల్లా ఆస్పత్రిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ హెల్ప్‌డెస్క్‌ను సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ సహాయ కేంద్రం ద్వారా కొవిడ్‌కు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. నగరంలోని అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో ఈ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సీపీ స్పష్టం చేశారు.
కొవిడ్ బారినపడి ఆస్పత్రిలో చేరిన బాధితులకు సంబంధించిన సమాచారాన్ని, ఇతర కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఈ సహాయ కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కొవిడ్‌కు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని... మాస్కులు ధరించడంతో పాటు శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తున్న వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిని కొనియాడారు. నగరంలోని కొవిడ్ ఆసుపత్రులలో ఈ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సీపీ స్పష్టం చేశారు.