ఎన్నికల సందర్బంగా హైదరాబాద్ నగరంలో కొందరు మతపరమైన అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. హైదరాబాద్ అభివృద్దిని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారిని.. అలాంటి వారికి నగరంలో స్థానం లేదని పేర్కొన్నారు.
'విద్వేషాలు రెచ్చగొట్టే వారికి నగరంలో చోటులేదు'
సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అసత్యాలు ప్రచారం చేసేవారిపై.. ప్రజలు కూడా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. భాగ్యనగరంలో కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
'విద్వేషాలు రెచ్చగొట్టే వారికి నగరంలో చోటులేదు'
హైదరాబాద్ సిటీకి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందని.. ఎవరైనా అలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు కూడా అలాంటి వారిపై డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అసత్యాలు ప్రచారం చేయొద్దని.. చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి :'ప్రజలు నిర్భయంగా, ధైర్యంగా ఓటేయాలి'