ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకునేందుకు.. చార్మినార్ వద్ద పోలీసులు ప్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
'ప్రజలు నిర్భయంగా, ధైర్యంగా ఓటేయాలి' - పాతబస్తీ చార్మినార్ వద్ద పోలీసుల కవాతు
పాతబస్తీ చార్మినార్ వద్ద పోలీసులు కవాతు నిర్వహించారు. కవాతులో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ గుర్రంపై ఎక్కి సవారీ చేశారు. ఈ కార్యక్రమంలో 400 మంది వివిధ దళాల పోలీసులు పాల్గొన్నారు. ప్రజలు నిర్భయంగా, ధైర్యంగా ఓటేసేలా పోలీసుల ఫ్లాగ్‌మార్చ్ చేపట్టారు.
!['ప్రజలు నిర్భయంగా, ధైర్యంగా ఓటేయాలి' cp anjani kumar said People should vote boldly and courageously](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9667810-433-9667810-1606359035036.jpg)
'ప్రజలు నిర్భయంగా, ధైర్యంగా ఓటేయాలి'
'ప్రజలు నిర్భయంగా, ధైర్యంగా ఓటేయాలి'
పాతబస్తీలోని రాజేష్ మెడికల్ హాల్, గుల్జారా హౌస్ మీదుగా నిర్వహించిన ఈ కవాతులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పాల్గొన్నారు. సుమారు 400 మంది వివిధ దళాల పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా, ధైర్యంగా ఓటేయాలని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికలు డిసెంబర్ 1న జరుగుుతండగా.. 4న కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి :కార్మిక సంఘాల ఆందోళన.. స్తంభించిన రవాణా