తెలంగాణ

telangana

ETV Bharat / city

సమీప చెరువుల్లోనే నిమజ్జనం చేసేలా చూడండి: సీపీ - గణేష్​ నిమజ్జనం

పోలీస్​ ఉన్నతాధికారులతో సీపీ అంజనీకుమార్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్​ ఉత్సవాలు, నిమజ్జన బందోబస్తుపై సూచనలు చేశారు. ట్యాంక్​ బండ్​ పరిసరాల్లో రద్దీ తగ్గించేందుకు సమీప చెరువుల్లోనే నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సమీప చెరువుల్లోనే నిమజ్జనం చేసేలా చూడండి: సీపీ

By

Published : Sep 5, 2019, 5:35 PM IST

గణేష్​ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల బందోబస్తుపై ఉన్నతాధికారులతో సీపీ అంజనీకుమార్​ సమీక్షించారు. ట్యాంక్​ బండ్​ పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్లైఓవర్లు, రైల్వే ట్రాక్​ల వద్ద దారి మళ్లింపు చేపట్టాలని ఆదేశించారు. భారీ విగ్రహాల నిమజ్జనంలో ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలన్నారు. మండపాలకు సమీపంలోని చెరువులు, కొలనుల్లోనే నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిమజ్జనం వరకు అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

సమీప చెరువుల్లోనే నిమజ్జనం చేసేలా చూడండి: సీపీ

ABOUT THE AUTHOR

...view details