హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీసే విధంగా ముట్టడులకు పిలుపునిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో అలజడి సృష్టించవద్దని చెప్పారు. ఆర్టీసీ ఐకాస నేతలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రుల నివాసం వద్ద భారీ భద్రతతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
'హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు' - tsrtc latest news
ఆర్టీసీ ఐకాస తలపెట్టిన మంత్రుల నివాసం ముట్టడిపై హైదరాబాద్ సీపీ స్పందించారు. సమ్మెలు, రాస్తారోకోలతో నగర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
'హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీస్తే ఊరుకోం'
ఈ సందర్భంగా మంత్రుల నివాసం వద్ద భద్రతను సీపీ పర్యవేక్షించారు. దేశ, విదేశాల నుంచి చాలా మంది వ్యాపారాల నిమిత్తం నగరానికి వస్తారన్నారు. కొంతమంది ఇలా సమ్మెలు, రాస్తారోకోల పేరుతో నగరాన్ని ఇబ్బంది పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
ఇదీ చూడండి : అయోధ్య తీర్పు ఉంటే.. చలో ట్యాంక్‌బండ్ ఎలా చేస్తారు?