పేలుడు కోసులో విచారణ...
బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్లో జరిగిన పేలుడు వ్యవహారంలో విచారణ కొనసాగుతున్నట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పేలుడుకు సంబంధించిన మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్టు ఎన్‌ఐఏ గుర్తించిన నేపథ్యంలో సీపీ స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు నగర పోలీసులు సమన్వయంతో దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని అంజనీకుమార్ వివరించారు.
నిషేధిత సరుకు కట్టడికి...
మరోవైపు నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపడుతున్నట్టు అంజనీకుమార్ తెలిపారు. నకిలీ విత్తనాలు, గంజాయి, ఇతర మత్తు పదార్ధాలను అరికట్టే విషయంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాల్సిన అవసరం ఉందని సీపీ అభిప్రాయపడ్డారు. నిషేధిత వస్తువుల అమ్మకాలను అరికట్టేందుకు ఇప్పటికే వ్యాపారులతో సమావేశం నిర్వహించామన్నారు. నిషేధిత సరుకు సరఫరా కానీ.. నిల్వ ఉంచటం కానీ చేయమని పాన్షాప్ల యజమానులు, వేర్హౌస్ యాజమాన్యాలు హామీ ఇచ్చినట్టు తెలిపారు. అక్రమార్కుల గురించి తెలిసిన వాళ్లు పోలీసులకు సమాచారం అందించాలని సీపీ కోరారు.