తెలంగాణ

telangana

ETV Bharat / city

7 రోజుల్లోనే వెయ్యికి పైగా పాజిటివ్​ కేసులు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. రోజు రోజుకూ వందల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ నెలలో వారం రోజుల్లోనే 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో వైరస్​ సోకిన వారి సంఖ్య నాలుగు వేలు దాటింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కరోనా ఉద్ధృతి అధికంగా ఉంటోంది. సడలింపుల అనంతరం జన సంచారం పెరగడంతో వైరస్‌ వ్యాప్తి పెరిగిందని వైద్యారోగ్య శాఖ చెబుతోంది.

7 రోజుల్లోనే వెయ్యికి పైగా పాజిటివ్​ కేసులు
7 రోజుల్లోనే వెయ్యికి పైగా పాజిటివ్​ కేసులు

By

Published : Jun 11, 2020, 5:51 AM IST

రాష్ట్రంలో బుధవారం కొత్తగా 191 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 4,111కు చేరుకుంది. బుధవారం 75 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మొత్తంగా రాష్ట్ర వాసుల్లో నమోదైన కేసులు 3వేల 663గా ఉన్నాయి. వలస కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 448 మంది వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం 2,138 మంది వేర్వేరు ఆసుపత్రులు, స్వీయ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మహమ్మారి కోరల్లో చిక్కి తాజాగా 8 మంది మృత్యువాత పడగా.. మొత్తం మృతుల సంఖ్య 156కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 143, మేడ్చల్‌లో 11 , సంగారెడ్డిలో 11, రంగారెడ్డిలో 8 మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాలలో 3, మెదక్‌లో 3, నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 2 చొప్పున, నిజామాబాద్‌, వికారాబాద్‌, నల్గొండ, సిద్ధిపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

పరిస్థితి ప్రమాదకరంగా..

జీహెచ్‌ఎంసీ పరిధిలో వైరస్‌ ఉద్ధృతికి అడ్డుకట్ట పడటం లేదు. తాజా కేసుల్లో 143 బల్దియా పరిధిలోనే వెలుగుచూశాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఒక‌రికి పాజిటివ్ రాగా కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు. పెషీలోని మిగితా ఉద్యోగులను ఇళ్లకు పంపారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం సైతం పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాగే కొనసాగితే జులై నెల‌ఖారు నాటికి పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంద‌ని రాష్ట్ర ఉన్నతాధికారులను హెచ్చరించింది. రోజుకు 100 కేసులకు మించి నమోదవుతున్నందున రాజధాని పరిధిలోనే నాలుగు జిల్లాల అధికారులతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని సూచించారు. దిల్లీ, ముంబై వంటి నగరాల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లోనే 70 శాతం పాటిజివ్‌ కేసులు వస్తున్న అంశాన్ని కేంద్ర బృందం సభ్యులు అధికారులకు వివరించారు.

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజల సహకారం కీలకమని.. ఇలా మాత్రమే వైరస్‌ను అడ్డుకోగలమని కేంద్ర బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇవీ చూడండి:కరోనా వేళ రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఇవి తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details