తెలంగాణ

telangana

ETV Bharat / city

హడలెత్తిస్తున్న కరోనా.. 1000కి చేరువలో కేసులు - corona news

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి హడలెత్తిస్తూనే ఉంది. గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 970 మంది మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 252 మంది కోలుకుని డిశ్చార్జి‌ అయ్యారు. ప్రస్తుతం 693 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండగా.. జోగులాంబ గద్వాల జిల్లాలో కేసులు సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది.

corona
హడలెత్తిస్తున్న కరోనా.. వెయ్యికి చేరువలో కేసులు

By

Published : Apr 24, 2020, 5:30 AM IST

Updated : Apr 24, 2020, 8:43 AM IST

కరోనా మహమ్మారి... రాష్ట్రంలో ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. నిన్న కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 970కు చేరింది. వీరిలో 252 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో 25 మంది మృతి చెందారు. మరోవైపు గాంధీ ఆస్పత్రిని మొత్తం 6 యూనిట్లుగా విభజించి.. ప్రతి యూనిట్​కి ఒక ప్రొఫెసర్​ని ఇంఛార్జిగా నియమించాలని మంత్రి ఈటల ఆదేశించారు. ముఖ్యంగా పిడియాట్రిక్ విభాగంలో చికిత్స పొందుతున్న చిన్నారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని.. గాంధీకి నూతన సూపరిండెంట్​గా నియమితులైన డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు.

జంట నగరాల్లో తబ్లిగీ జమాతేకు వెళ్లి వచ్చిన వారి సన్నిహితులపై పోలీసులు దృష్టి సారించారు. వారితో కలిసి తిరిగిన అనేక మంది.. ప్రైమరీ కాంటాక్ట్​లుగా వైరస్‌ బారిన పడుతున్నారు. సుమారు 375 మంది వరకు కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరింత మంది ప్రైమరీ కాంటాక్టుల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సూర్యాపేటలో..

సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు పెరగటాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. వైరస్‌ నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఓఎస్డీ సర్ఫరాజ్ అహ్మద్, ఐజీ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అత్యధిక కేసులకు కారణమైన కూరగాయల మార్కెట్ పరిసరాల్ని మరోసారి పరిశీలించారు. బీబీగూడెం, ఆత్మకూరు మండలంలోని ప్రభావిత గ్రామం సహా తిరుమలగిరిలో స్క్రీనింగ్‌ను మరింత పెంచారు. సిమెంటు కర్మాగారంలో పనిచేసే ఆంధ్రప్రదేశ్ వాసికి కరోనా సోకడం వల్ల మట్టపల్లి, రామచంద్రాపురం తండా, సింహపురి కాలనీని దిగ్బంధించారు.

యాదాద్రిలో..

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని వరంగల్ - హైదరాబాద్ బైపాస్ రహదారికి కలిసే ఏడు రహదారులలో నాలుగింటిని అధికారులు మూసివేశారు. కరోనా ప్రబలుతున్న వేళ అనవసరమైన ప్రయాణాలు తగ్గించడంలో భాగంగా.. నిర్ణయం తీసుకున్నామని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.

ఖమ్మం జిల్లా మధిరలో స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి సారించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతీ చెక్​పోస్ట్ వద్ద నిఘా పటిష్ఠం ఉండేలా ఎప్పటికప్పుడు సందర్శిస్తూ అధికారులను స్థానిక వాలంటీర్లను సూచనలు జారీ చేస్తున్నారు. మధిరలోకి ప్రవేశించేందుకు ఉన్న నలుదిక్కుల మార్గాలను పూర్తిగా మూసి వేయించి కేవలం ఒక వైపు నుంచే నియోజకవర్గంలోకి ప్రవేశించేలా జొన్నలగడ్డ, దేశినేని పాలెం మధ్యలో ఏర్పాటు చేశారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. గురువారం 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 42కు చేరింది. కేవలం ఇప్పటి వరకు నలుగురు మాత్రమే కోలుకున్నారు.

ఇవీచూడండి:దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

Last Updated : Apr 24, 2020, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details