తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈనెల 6 నుంచి పోలీసు, రెవెన్యూ సిబ్బందికి టీకా - covid vaccine to telangana municipal staff

తెలంగాణలో ఈనెల 6 నుంచి పోలీసు, పురపాలక, రెవెన్యూ, పంచాయతీ శాఖల సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్​లు అందించనున్నారు. 15 తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

covid vaccine to telangana police, revenue and municipal employees starts from February 6th
ఈనెల 6 నుంచి పోలీసు, రెవెన్యూ సిబ్బందికి టీకా

By

Published : Feb 2, 2021, 7:59 AM IST

రాష్ట్రంలోని పోలీసు, పురపాలక, రెవెన్యూ, పంచాయతీ శాఖల సిబ్బందికి ఈ నెల 6 నుంచి 15 వరకు కొవిడ్‌ టీకాలను అందించనున్నారు. ఈ శాఖలకు చెందిన 2 లక్షలకు పైగా లబ్ధిదారులు టీకాను పొందనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 1,68,589 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది కొవిడ్‌ టీకాలు పొందారు. ఈ నెల 3, 4, 5వ తేదీల్లో వీరికి మళ్లీ టీకాలు ఇవ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details