రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ దాదాపు పూర్తైంది. అక్కడక్కడా సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా 1200 వందల కేంద్రాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ చేపట్టగా అందులో సుమారు 750కేంద్రాల్లో మాత్రమే కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైరన్ని పూర్తి చేశామని ఇతర ప్రాంతాల్లో మాన్యువల్‌గా డ్రైరన్ చేపట్టినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. హైదరాబాద్‌లో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు, పలు పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలోనూ డ్రైరన్ చేపట్టారు.
తెలంగాణ వ్యాప్తంగా 1200 కేంద్రాల్లో కొవిడ్ డ్రైరన్ - telangana varthalu
కొవిడ్ టీకా ముందస్తు సన్నాహకాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాల్లో శుక్రవారం కొవిడ్ డ్రైరన్ నిర్వహించారు. కొవిన్ సాఫ్ట్‌వేర్ పనితీరు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సన్నద్ధత తదితర అంశాలపై దృష్టి సారిస్తున్నారు.
ఈ నెల 13, 14,15 తేదీల్లో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉన్నట్టు ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర వివరించారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలో భాగంగా డ్రైరన్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్‌లో లబ్దిదారుల వివరాలు సరిపోల్చుకోవటం సహా... వ్యాక్సినేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి వాటిని సరిచూసుకుని సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించుకోవటమే ఈ డ్రైరన్ ఉద్దేశమని వివరించారు.
ఇదీ చదవండి: 1,200 కేంద్రాల్లో కొనసాగుతున్న కొవిడ్ టీకా డ్రై రన్